12-09-2025 11:17:52 AM
గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల పరిధిలోని ముల్కనూరు పిఏసిఎస్ లో శుక్రవారం యూరియా పంపిణిని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గోడౌన్ లోని యూరియా నిల్వలను వ్యవసాయ శాఖ అధికారి కావటి రామారావును అడిగి తెలుసుకున్నారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసి, పద్ధతి ప్రకారం యూరియా పంపిణీ చేపట్టాలని అధికారులను సూచించారు.యూరియా పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేయాలని అన్నారు.ఈసందర్శనలో కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ అధికారి కావటి రామారావు, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గార్ల బయ్యారం సీఐ బి. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.