3 July, 2026 | 2:07 AM

ఎన్ హెచ్ 563, 63 పనులు వేగవంతం చేయాలి

03-07-2026 01:21 AM

కోరుట్ల, జూలై 2 (విజయక్రాంతి): ఎన్ హెచ్ 563 జగిత్యాల నుండి కరీంనగర్ , ఎన్ హెచ్ 63 ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు పనుల వేగవంతం కోసం కరీంనగర్, జగిత్యాల జిల్లా కలెక్టర్లతో తెలంగాణ రవాణా మరియు రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ గురువారం హైదరాబాద్ సెక్రటరియేట్ నుండి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఆర్డీవో కోరుట్ల మెట్పల్లి, జగిత్యాల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.