3 July, 2026 | 2:12 AM

కొరియర్ ముసుగులో గంజాయి సప్లై

03-07-2026 01:20 AM
  1. జార్ఖండ్ కేంద్రంగా భారీ నెట్వర్క్
  2. 21 రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా
  3. మ్యాంగో, స్టిక్, ఫ్లవర్.. వీరి కోడ్ పదాలు
  4. అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు
  5. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

బంజారాహిల్స్, జూలై 2 (విజయక్రాం తి): కొరియర్ సేవల ముసుగులో దేశవ్యాప్తంగా గంజాయి విక్రయిస్తున్న భారీ అంత ర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) పో లీసులు రట్టు చేశారు. జార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌కు చెందిన ప్రధాన సూత్రధారి, మాజీ లారీ డ్రైవర్ సత్యం మి శ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు.

ఈ ము ఠా మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ వంటి కోడ్ పదాలను ఉపయోగిస్తూ హైదరాబాద్, ముంబ యి, బెంగళూరు, ఢిల్లీ సహా దేశంలోని సు మారు 21 రాష్ట్రాల్లో తమ నెట్వర్క్‌ను విస్తరించింది. జార్ఖండ్‌లోని పోస్ట్ ఆఫీసుల ద్వారా పార్శిళ్లలో మందులు ఉన్నాయని చెప్పి స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయిని రవాణా చేస్తున్నా రు. రోజుకు 80 నుంచి 100 ఆర్డర్లను పూర్తి చేస్తున్నారు. ప్రతి పార్శిల్‌కు పరిమాణాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఈ పద్ధతిలో రోజుకు లక్ష రూపాయలకు పైగా, ఏడాదికి సుమారు రూ.4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఆర్డర్ల కోసం ముఠా స భ్యులు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ ద్వా రా యూపీఐ పేమెంట్స్ అందిన వెంటనే ముంబైలోని తమ సహచరుల ద్వారా స్థాని క రైళ్లు, ఆటోల వంటి ప్రజా రవాణా వ్యవస్థల సహాయంతో చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. పోలీసుల ద ర్యాప్తును పక్కదారి పట్టించేందుకు నిందితుడు సత్యం మిశ్రా తన తల్లి పేరు మీద ఉ న్న బ్యాంక్ ఖాతాను వాడుతూ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. 

ఇలా పట్టుకున్నారు

జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన ఒక గంజా యి పార్శిల్ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన హెచ్-న్యూ పోలీసులు, ఇక్కడి కస్టమర్లు సుశాంత్ వ్యాస్, లడ్డు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. వారిచ్చిన సమాచారంతోనే అంతర్రాష్ట్ర సప్లై లింక్ వెలుగుచూసిందని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఇండియా పోస్ట్ (స్పీడ్ పోస్ట్) సేవలను వాడుకున్నారన్నారు.

రైళ్లు, విమానాల ద్వారా పార్శిళ్ళు హైదరాబాద్కు చేరినట్లు దర్యాప్తులో స్పష్టమైందన్నారు. ఈ రవాణా మార్గాల్లో పార్శిళ్లకు ఎలాంటి స్కానింగ్ జరగకపోవడాన్ని గమనించిన హైదరాబాద్ సిటీ పోలీస్, భద్రతా లోపాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అధికారికంగా సమాచారం అందించాలని నిర్ణయించిందని ప్రకటించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిందితులు భారీగా బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన సత్యం మిశ్రాను రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న అతని సోదరుడు శుభమ్ మిశ్రాతో పాటు రాహుల్ ఝా, సచిన్ మిశ్రా, సంతోష్ పండిట్ ల కోసం గాలింపు ముమ్మరం చేశామని సీపీ తెలిపారు.