13 June, 2026 | 2:14 AM

స్టాన్లీ కాలేజీలో జాతీయ స్థాయి హ్యాకథాన్

13-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ వి మెన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి రెండు రోజుల హ్యాకథాన్ ‘విన్‌నోవీఎక్స్ హ్యాక్ ఫెస్ ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పరిశ్రమ నిపుణుడు డా. బాల ప్రసాద్ పెడ్డిముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ కృష్ణారావు, రాకేష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బి.ఎల్. రాజు, డీన్ అకాడెమిక్స్ ఎ. వినయ బాబు, కన్వీనర్లు జి. శ్రీలత, ఎం. రాజేష్, పల్లవి బి, మౌమిత పాల్, సుమయ్య అఫ్రీన్, అస్మా బేగం, ఏవో రమేష్, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు, మెంటర్లు, జ్యూరీ సభ్యులు, దేశంలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు పాల్గొన్నా రు.

అమెరికాలోని యూనివర్సిటీ ఎట్ బఫెలో, యూనివర్సిటీ ఆఫ్ టొరం టో, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులు ఈ హ్యాకథాన్లో పాల్గొనడం విశేషం.

ముఖ్య అతిథి డా. బాల ప్రసాద్ పెడ్డి తన ముఖ్యోపన్యాసంలో కృత్రి మ మేధస్సు రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు. ఈ హ్యాకథా న్లో ప్రతి బృందానికి మహిళా నాయకత్వం తప్పనిసరి చేయడం విశేషం. ప్రతిభ కనబరిచిన బృందా లకు మొత్తం రూ.80 వేల నగ దు బహుమతులు అందజేయనున్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.20 వేలు, మూడవ బహుమతి రూ.10 వేలుగా నిర్ణయించారు.