13 June, 2026 | 2:13 AM

చివరిచూపు కోసం ఎదురుచూపులు

13-06-2026 12:00 AM

చేగుంట, జూన్ 12 : బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి గుండె పో టుతో మరణించా డు.. కుటుంబీకు లు చివరి చూపు కోసం ఎదురుచూస్తూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయికిరణ్ (35) ఉపాధి కోసం గతే డాది దుబాయ్ వెళ్లగా.. ఈ నెల 2న విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందాడు.

మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. చివరి చూపు కోసం ఎదు రుచూస్తూ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక  చొరవ చూపి తమ కుటుంబానికి సహాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్నారు.