చర్లపల్లిలో జాతీయ పోషణ వారోత్సవం
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 2: కామినేని మెడికల్ కాలేజ్(Kamineni Medical College) ప్రిన్సిపాల్ డా. బాబాసాహెబ్ లక్ష్మాన్ సింగ్ కూడగి ఆధ్వర్యంలో చర్లపల్లి రూరల్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ లో బుధవారం జాతీయ పోషణ వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. మారుతి వరప్రసాద్ శర్మ, ప్రొఫెసర్ డా. బాలరాజు పాల్గొని పోషకాహార విలువలపై అవగాహన కల్పించారు.
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే లభించే పదార్థాలతో పోషకాహారం ఎలా తీసుకోవాలో వివరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సుష్మ, మెడికల్ ఆఫీసర్ డా. దేవకుమారి గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కౌమార బాలికలకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమం అనంతరం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పండ్లు, రాగిజావ, కూరగాయ మొక్కలు, విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డా. శంకర్, డా. మౌనిక, డా. నరేన్ దత్, డా. నితిన్, హెల్త్ అసిస్టెంట్లు బద్దం నగేష్, ఎంఎస్డీ స్వామి, పారామెడికల్ సిబ్బంది యాదగిరి రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్లు గోపాల్, నాగరాజు, అలీ, ఏఎన్‌ఎం లు నాగేంద్ర, మంజుల, వనజ, విజయ, హౌస్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.






