19 July, 2026 | 2:15 AM

ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభ

19-07-2026 12:00 AM

బెంగళూరులో నిర్వహణ

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

ముషీరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా బీసీలను ఏకం చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆగస్టు 7న బెంగళూరులో జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా, జాతి జనగణనలో బీసీ కులగణన, చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ సభకు వేలాదిగా బీసీలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, కుందారం గణేష్ చారి, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కురుమ, ప్రొఫెసర్ సంఘాని మల్లేశ్వర్, కౌలే జగన్నాథం, గొడుగు మహేష్ యాదవ్, భూదాని సదానందం, జాజుల లింగం గౌడ్, తారకేశ్వరి, స్వర్ణ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, వరికుప్పల మధు, సంధ్యారాణి, బ్రహ్మచారి, భరత్ గౌడ్, అనంతుల సాయి, సత్యం గౌడ్, బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు.