19 July, 2026 | 2:15 AM

డ్రగ్స్‌కు అడ్డుకట్ట.. యువతను కాపాడుదాం

19-07-2026 12:00 AM
  1. కిమ్స్ నర్సింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన
  2. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్, జూలై 18(విజయక్రాంతి): యువత మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటేనే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రెడ్డి రాణి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భా గంగా శనివారం ప్యారడైస్‌లోని వెస్లీ కళాశాలలో కిమ్స్ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్, మద్యం తదితర వ్యసనాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెడ్డిరాణి మా ట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రభావం, చెడు స్నేహాల కారణంగా కొందరు యువత చిన్న వయసులోనే మాదకద్రవ్యాలు, మ ద్యానికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యసనాలు ఆరోగ్యానికే కా కుండా కుటుంబం, సమాజం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచి, మంచి విలువలు అలవర్చాలని సూ చించారు.

ముఖ్య అతిథిగా రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ భారతి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయన్నారు. విద్యార్థి దశ నుంచే బాధ్యతాయుతంగా మె లగాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూ రంగా ఉండాలని సూచించారు. నగరంలో మాదకద్రవ్యాల వ్యసనానికి సంబంధించిన కేసుల గణాంకాలు, వాటిని అదుపు చేసే విధానాల గురించి వివరించారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యం మాదకద్రవ్యాలు, మద్యం తదితర వ్యసనాల నుంచి ప్రజలను దూరంగా ఉంచి, అవగాహన, చికిత్స, పునరావాసం, సమాజ భాగస్వామ్యంతో వ్యసన రహిత భారతదేశాన్ని నిర్మించడమేనన్నారు. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ చౌదరిలు మానసిక సమస్యలు, నగరంలో అందుబాటులో ఉన్న సేవల గురించి మాట్లాడారు.

కిమ్స్ కళాశాల వెస్లీ విద్యార్థుల కోసం క్విజ్, ఉపన్యాసం, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించి, బహుమతులను పంపిణీ చేసిం ది. ఈ కార్యక్రమంలో కిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వెస్లీ కళాశాల ప్రిన్సి పాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.