8 August, 2026 | 1:15 AM

నేడు జాతీయ పోలీసు సదస్సు

08-08-2026 12:00 AM

లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఆధునిక పోలీసింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సైబర్ క్రైమ్, అభివృద్ధి చెందుతున్న సవాళ్లు’ అనే అంశంపై జాతీయ పోలీసు సదస్సును శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ క మాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(పోలీస్ కమాండ్ సెంటర్), హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

ఈ సదస్సుకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షత వహించనున్నారు. మాజీ హోంమంత్రులు కుందూరు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి విశిష్ఠ అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ, లక్ష్యం ఛారిటబుల్ సొసైటీ చైర్మన్ కపిలవాయి దిలీప్‌కుమార్ సమన్వ యం చేస్తున్నారు.

ఈ జాతీయ సదస్సులో పలువురు ప్రస్తుత, పదవీ విరమణ చేసిన సీనియర్ పోలీస్ అధికారులు, అలాగే ఫోరెన్సిక్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), జైళ్లు, కరెక్షనల్ అడ్మిసిస్ట్రేషన్ రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులు పాల్గొని, ఆధునిక పోలిసింగ్‌లో ఎదురవుతున్న సవాళ్లు, నూతన ప రిణామాలపై చర్చించనున్నారు. ఈ సదస్సు ను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ప్రారంభించనున్నారు. కాగా ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితరులు పాల్గొననున్నారు.