calender_icon.png 8 December, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవరాజు శిల్పకళకు జాతీయ గుర్తింపు

08-12-2025 12:03:03 AM

-రేపు సొసైటీ భవనంలో శిల్పాల ప్రదర్శన

-న్యాల్కల్ గ్రామానికి చెందిన శిల్ప కళాకారుడు  

జహీరాబాద్, డిసెంబర్ 7(విజయక్రాంతి): అందమైన రాతి శిల్పాలకు ప్రాణం పోసినట్లు గా బసవరాజు చెక్కిన శిల్పాలకు జాతీయ గుర్తు లభించింది. బసవరాజు చిన్నతనం నుం చి శిల్పకళలపై మక్కువ ఉండటంతో ఆయన ఆ కళల వైపే పరుగులు తీశాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన బసవరాజ్ తండ్రి అడిగప్ప ఉపాధ్యాయుడు.

తండ్రి ప్రోద్బలంతో తల్లి సహకారంతో చదువు ముందుకు సాగిస్తూనే బసవరాజు శిల్పకళపై ప్రేమ పెంచుకున్నారు. తండ్రి ప్రోత్సహించడంతో శిల్పకళ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.రాజు చెక్కిన రాతి శిల్పాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బసవరాజు చెక్కిన శిల్పాలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో 98వ జాతీయ ఆరట్స్ దినోత్సవానికి ఆహ్వా నం అందింది. శిల్పకళలు చెక్కడంలో నైపుణ్య త సాధించిన బసవరాజుకు డాక్టరేట్ బిరుదు కూడా లభించింది. డాక్టర్ బసవరాజ్ చెక్కిన శిల్పాల్లో విధి శిల్పాలు సామాజిక సందేశాలతో పాటు ప్రకృతి పరిరక్షణ, చెట్ల పెంపకం, పశుపక్ష్యాదుల రక్షణ, కాలుష్య నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించేలా ఈ శిల్పా లు తయారు చేస్తుంటారు.

ఆల్ ఇండియా ఫైన్ ఆరట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ నిర్వహించే సొసైటీ భవనంలో ఈనెల 9న సాయంత్రం ఐదు గం టలకు సుష్మక బాల్ ఆరట్స్ అడ్వైజర్, కన్జర్వేషన్ చేత ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శన లో శిల్పి డాక్టర్ బసవరాజు రూపొందించిన రెండు కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవులు జంతు జలాల మధ్య ఉన్న అధికారాలు, సంబంధాన్ని ప్రతిపాదించేలా శిల్పాలు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చాయని డాక్టర్ బసవరాజు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ గ్రామంలో శిల్పి డాక్టర్ బసవరాజుకు అరుదైన గౌరవం దక్కడంతో పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.