ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ విజ్ఞాన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సైన్స్ ప్రదర్శనలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. అధ్యాపకులు విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనల అవసరం వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
విద్యార్థినులు సైన్స్ మోడళ్లు, పోస్టర్లను ప్రదర్శిస్తూ తమ సృజనాత్మకతను చాటారు. వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి. శారద మాట్లాడుతూ... “విజ్ఞానం దేశాభివృద్ధికి మూలస్తంభం. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అధ్యాపకులు, సిబ్బంది , విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




