calender_icon.png 14 November, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో నవీన్ యాదవ్

14-11-2025 09:28:42 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు(Jubilee Hills by election counting) ప్రారంభమై కొనసాగుతోంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. ముగిసిన రెండో రౌండ్ లోనూ 1082 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు 18,617, బీఆర్ఎస్‌కు 17,473, ఓట్లు పడ్డాయి. ఉదయం 8 గంటలకు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగింది. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు 42 టేబుల్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో 186 సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోందైంది. ఈ ఉప ఎన్నికలో 1,94,631 మంది ఓటర్లు ఓటు వేశారు. అందులో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ డివిజన్ లో 29,760, రహమత్ నగర్ డివిజన్ లో 40,610, ఎర్రగడ్డ డివిజన్, 29,112, వెంగళరావునగర్ లో 25,195, షేక్ పేట్ డివిజన్ లో 31,182, యూసఫ్ గూడ డివిజన్ లో 24,219, సోమాజిగూడ డివిజన్ లో 14,553, ఓట్లు పోల్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మాగంటి సునీత(బీఆర్ఎస్), నవీన్ యాదవ్( కాంగ్రెస్), దీపక్ రెడ్డి(బీజేపీ) ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.