14-11-2025 10:59:20 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐదో రౌండ్ ముగిసేసరికి 12,651 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. వరస ఐదు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం కనబరిచింది. ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,178 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ కు 28,999, బీఆర్ఎస్ కు 22,987, బీజేపీకి 5361 ఓట్లు పడ్డాయి.