14-11-2025 11:55:31 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడుతోంది. ఏడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరసగా ఏడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ రౌండ్ లో 4030 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఏడో రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ మెజార్టీ 19,619 వేలు దాటింది.