calender_icon.png 10 May, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడి మృతులకు 10 లక్షల పరిహారం

24-04-2025 02:08:00 AM

అనంత్‌నాగ్, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అండగా నిలిచింది. మంగళవారం అనంత్‌నాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగిన మారణహోమంలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో చనిపోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూ ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో  తెలిపింది. అలాగే తీవ్రంగా గా యపడిన వారి కుటుంబాలకు రూ. 2 లక్ష లు, స్వల్పంగా గాయపడిన వారికి రూఉగ్రదాడి జరిగిన ప్రదేశంలో అమిత్ షా పర్య టించారు.

కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభు త్వం అందించే పరిహారంతో పాటు కేంద్రం కూడా పరిహారం చెల్లించేందుకు సిద్ధమవుతోందని షా ఒక ప్రకటనలో తెలిపారు.