calender_icon.png 13 December, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలకు అండగా నీలం

13-12-2025 07:43:55 PM

నల్లవల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి కార్యకర్త ఇళ్లు దగ్ధం..

యాబై వేల ఆర్థిక సహాయం అందజేత..

పటాన్ చెరు: గుమ్మడిదల మండలం నల్లవల్లిలో ప్రమాదవశాత్తు నిన్న గ్యాస్ సిలిండర్ పేలి కాంగ్రెస్ కార్యకర్త కుమ్మరి ప్రశాంత్ ఇళ్లు దగ్ధం అయిన ఘటన, అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న మంగలి విష్ణు, గాండ్ల జగదీష్, బొడ్డు వికాస్ ఇళ్లకు వెళ్లి బాధితులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అండగా నిలిచారు. ప్రమాద ఘటనను తెలుసుకున్న నీలం మధు శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులను, అనారోగ్యం బారిన పడిన వారిని పరామర్శించారు. 

ఇల్లు దగ్ధం అయిన కుమ్మరి ప్రశాంత్ కుటుంబ సభ్యులకు యాబై వేల ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సర్పంచ్ కొరివి రాణి సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు, బొంతపల్లి గుడి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జైశంకర్, వీరరెడ్డి, మహేందర్ రెడ్డి, అశోక్, మహేష్, గారెల మల్లేష్, వీరేశ్, తుడుం శ్రీనివాస్, వెంకటేష్, నాగరాజు, మురళి గౌడ్, శివ, నవీన్, కిరణ్, కాంగ్రెస్ శ్రేణులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.