13-12-2025 07:47:53 PM
పేద ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఐ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి
బీసీ హక్కుల సాధన స మితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనంజయ నాయుడు
గరిడేపల్లి (విజయక్రాంతి): దోపిడి పీడనలు లేని సమాజం రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులతోనే సాధ్యమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు కోరారు. శనివారం మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని గానుగబండ, రంగాపురం గ్రామాల్లో పోటీ చేస్తున్న సీపీఐ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిరంతరం కార్మిక కర్షక సమస్యలపై నిలబడి పోరాటం చేస్తున్న ఎర్రజెండా బిడ్డలు కడియాల పద్మ, కట్టా కళ్యాణి లను ఈ ఎన్నికల్లో గెలిపించి నీతికి నిజాయితీకి ప్రజలు పట్టం కట్టాలని కోరారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు మారుతూ పొద్దుపొడిస్తే ఒక పార్టీ పొద్దుగూకితే మరొక పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారు కేవలం ఎన్నికలలో లబ్ధి పొందటానికి మాయమాటలు చెప్పి ఓటర్లను మోసం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అటువంటి వారి మాటలకు మోసపోకుండా సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. సీపీఐ మద్దతిచ్చిన సర్పంచ్ వార్డు సభ్యులకు బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, మాస్ లైన్ పార్టీలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యులు పోకల వెంకటేశ్వర్లు, మండల సీపీఐ కార్యదర్శి కడియాల అప్పయ్య, సహాయ కార్యదర్శి పోటు బుజ్జిబాబు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముళ్ళ జానయ్య, ఎల్లావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.