24 April, 2026 | 7:00 PM

Breaking News

శివాజీనగర్ అంగన్‌వాడి కేంద్రంలో గర్భవతులకు సీమంతం   •   ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుంది   •   చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి   •   నిరుపేదల సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉంది   •   హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •   విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •  

నీట్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

11-09-2024 01:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నీట్ పీజీ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ విడుదల చేసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నది. ఈ నెల 20న రిజిస్ట్రేషన్ ప్రారంభమై, ఈ నెల 26 మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఆప్షన్స్ కోసం ఈ నెల 23  నుంచి 26 వరకు గడువు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ ఈ నెల 26న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.55 వరకు సాగుతుంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 27 నుంచి 29 వరకు జరుగుతుంది. మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ లోపల కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.