31 August, 2026 | 4:10 AM

నీట్‌గా నీట్ పీజీ పరీక్ష

31-08-2026 12:38 AM

మొయినాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ 2026

మొయినాబాద్, ఆగస్టు 30(విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ2026 పరీక్ష మొయినాబాద్లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పరీక్షకు అభ్యర్థులను ముందస్తుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొయినాబాద్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 340 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 333 మంది పరీక్షకు హాజరయ్యారు.

చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కేంద్రంలో 120 మందికి 118 మంది, విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో 100 మందికి 96 మంది, గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో 120 మందికి 119 మంది పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల ముందస్తు చర్యలు, పకడ్బందీ ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష సజావుగా ముగిసింది. దీంతో అధికారులు, అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.