31 July, 2026 | 4:13 AM

ముగిసిన నీట్ రీ ఎగ్జామ్

23-06-2024 09:30 PM

న్యూఢిల్లీ : నీట్ - యూజీ 2024 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెలువడుతున్న వేళ ఆదివారం ఎన్టీఏ నీట్ రీ పరీక్షను నిర్వహించింది. నీట్ లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపిన ఎన్టీఏ సుప్రీంకోర్టు ఆదేశంతో గ్రేస్ మార్కులను రద్దు చేసింది. దీంతో ఈ నీట్ రీ ఎగ్జామ్ ను ఏడు సెంటర్లలో 1563 మంది విద్యార్థులకు మళ్లీ నిర్వహించింది.  813 మంది హాజరు కాగా.. 750 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.ఈ రీ ఎగ్జామ్ కు దాదాపు సగం మంది అభ్యర్థులు హాజరు కాలేదు.