31 July, 2026 | 3:27 AM

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర

23-06-2024 10:44 PM

హైదరాబాద్:  రాజ్యసభలో బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌గా వద్దిరాజు రవి చంద్ర, పార్టీ విప్‌గా ఎంపీ దివకొండ దామోదర్‌రావుని బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ నియమించారు. ఆదివారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రవిచంద్ర ఇటీవలే రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. బీసీ వర్గానికి చెందిన ఎంపి రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా నియమించడం పట్ల పార్టీ శ్రేణులు, బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.