calender_icon.png 14 August, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యం నీడన.... క్రీడా మైదానం.!

14-08-2025 01:18:25 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఎంతోమందిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దున బెల్లంపల్లి ఫుట్ బాల్(వన్ గ్రౌండ్)(Bellampalli Football Ground) కు కనీస గుర్తింపు లేకుండా పోయింది. సింగరేణి తిలకు క్రీడా మైదానంగా పేరొందిన ఈ క్రీడా మైదానం బోర్డులోని అక్షరాలు పూర్తిగా చెదిరిపోయి బోసిపోయింది. నిత్యం ఉదయం ,సాయంత్రం ఈ క్రీడా మైదానం క్రీడాకారులతోపాటు వాకర్స్, వివిధ క్రీడల్లో శిక్షణ పొందే చిన్నారులతో చాలా రద్దీగా ఉంటుంది. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో గల పాఠశాలల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఈ మైదానంలోని నిర్వహిస్తారు. జాతీయస్థాయి క్రీడా పోటీలకు,రాష్ట్రస్థాయి రాజకీయాలకు ఈ మైదానమే వేదికగా మారుతుంది. గతంలో సింగరేణి నిర్వహించిన కోరిండియా పోటీలకు అగ్రభాగంగా నిలిచింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ క్రీడా మైదానం అభివృద్ధి పై సింగరేణి అధికారులు సవతి తల్లి ప్రేమను చూపిస్తుండడం పట్ల క్రీడాకారులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా తిలక్ క్రీడా మైదానానికి కొత్త బోర్డు ను ఏర్పాటుచేసి క్రీడాకారులకు వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.