14-08-2025 01:44:01 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తన భర్త సంగం శ్రీనివాస్ రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, డయాలసిస్ చేస్తే పచ్చలు అయి మంచిర్యాలలోని హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని మనసున్న దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలను కాపాడేందుకు ఆర్థిక సహాయం చేయాలని బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామానికి చెందిన సంగం సత్యవతి వేడుకుంటుంది. ఇప్పటికే రూ లక్ష వరకు వైద్యం కోసం ఖర్చు పెట్టామని, మరో రెండు లక్షలు వైద్యానికి అవసరం ఉందని వేడుకుంటుంది. అప్పుచేసి ఆసుపత్రిలో చేర్పించామని,తమ కుటుంబానికి వైద్యం అందించే స్తోమత లేదని కన్నీటి పర్యంతమవుతుంది. మనసున్న దాతలు తమ పరిస్థితిని గుర్తించి తన భర్త వైద్యానికి 9391536937 నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుంటుంది.