14-08-2025 01:10:44 PM
తెగిన రోడ్డు గుంతలో పడ్డ బస్సును వెలికి తీస్తున్నారు క్రేన్
మహబూబ్ నగర్ టౌన్: మహబూబ్ నగర్(Mahabubnagar) పరిధిలోని ఎన్ హెచ్ 44 రోడ్డు నుంచి అమర్ రాజా, ఐటీ పార్కు వెళ్లే బీటీ రోడ్డు వర్షం దాటికి తెగిపోయింది. పై నుంచి వర్షం నీరు రావడంతో రోడ్డు కింది భాగం లో మట్టి పోవడంతో రోడ్డు కూడా తెగిపోయింది. ఆ సమయంలోనే అమర రాజా బస్సు వెళుతున్న క్రమంలో బస్సు ఒక్కసారిగా కుంగిన రోడ్డు లోయ లోకి వెళ్లిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సిబ్బంది బస్సు దిగి పోయారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పొంగిన రోడ్డులో ఇరుక్కున్న బస్సును ట్రైన్ సాయంతో బయటకి తీస్తున్నారు.