calender_icon.png 14 August, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవ దానానికి ముందుకు వచ్చిన ఉపాధ్యాయుని కుటుంబం

14-08-2025 01:15:03 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): జనహిత సేవాసమితి సభ్యులు, ఉపాధ్యాయులు పాతకాల కుమార్, అతని భార్య రేణుక, కుమారుడు ఆదిత్య వర్ధన్ లు నేత్ర, అవయవ దానం(organ donation) కోసం ముందుకు వచ్చారు. వీరికి జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ డోనర్ కార్డ్స్ ను అందించి ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా ఆడెపు సతీష్ మాట్లాడుతూ జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో నేత్ర, అవయవ, శరీర దానాల కోసం అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల నుండి అంగీకార పత్రాలను తీసుకుని 5 నేత్రదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు అపోహలను వీడి మరణానంతరం వృధా అయ్యే నేత్ర, అవయవాలను దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.