14-08-2025 01:40:44 PM
అకాల వర్షంతో మూడు ఎకరాల పైరు కొట్టుకుపోయిన దృశ్యం
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని(Thungathurthy Mandal Area) వెలుగు పెళ్లి గ్రామానికి చెందిన మురిగందుల వెంకన్న ఈ సీజన్లో కష్టపడి మూడు ఎకరాలు వరి పైరు నాటు పెట్టారు. అకాల కుంభవృష్టితో, రుద్రమ్మ చెరువు ఉగ్రరూపం దాల్చడంతో, వరద ప్రవాహానికి మూడు ఎకరాలు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60 వేలకు పైగా నష్టం జరిగినట్లు తెలిపారు. తక్షణమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేద రైతుల ప్రయోజనాల దృష్ట్యా, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో పరిశీలించి, వంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లి, వందల ఎకరాల్లో రైతులు వరి పంటలు నష్టపోయినట్లు పేర్కొంటున్నారు.