14-08-2025 01:13:36 PM
డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): గంజాయి సరదాగా సేవించిన జైలుకెళ్లడం ఖాయమని నల్లగొండ(Nalgonda) డిఎస్పీకే శివరామిరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో మెరుపు దాడులలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పట్టుబడిన 10 మంది యువకులను రెండు వేరు వేరు కేసులలో 10 మంది యువకుల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి వారి వద్ద నుండి రూ. 30,000/-లు విలువ చేసే 1.65 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేసినా, అమ్మినా, ఎవరైనా వినియోగించినా,వాడినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయములో తల్లితండ్రులు లేదా కాలనీ పెద్దలు పోలీసు లను సమాచారము ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని డి.ఎస్.పి పేర్కొన్నారు. ఇట్టి కేసును నల్గొండ డీఎస్పీ పర్యవేక్షణలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి ఆద్వర్యంలో నల్గొండ యస్.ఐ లు జె. గోపాల్ రావు, కె సతీష్ సిబ్బంది ఏఎస్ఐ లు వెంకటయ్య, వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ రబ్బాని, కానిస్టేబుళ్లు శకీల్, శ్రీకాంత్, శంకర్, ఆంజనేయులు, రమాదేవి, మహేశ్వరి, హోంగార్డులు సైదులు, శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.