calender_icon.png 14 August, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలపై మంత్రి పొంగులేటి సమీక్ష.. జిల్లాకు రూ. 1 కోటి విడుదల

14-08-2025 01:38:06 PM

  1. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి విడుదల: మంత్రి పొంగులేటి
  2. భారీ వర్షాలు, సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష
  3. కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్..

హైదరాబాద్: భారీ వర్షాల పట్ల తెలంగాణ సిద్ధమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddyజిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సూచనలను అనుసరించి, రెవెన్యూ, గృహనిర్మాణం, ఐపీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి గురువారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు(heavy rains) తీసుకుంటున్న చర్యలను సమీక్షించడానికి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బందిని వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. భారీ వర్షాల పట్ల అప్రమంత్తంగా ఉండాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు. వచ్చే మూడ్రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత చర్యలు చేపట్టాలని తెలిపారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి కలెక్టర్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు, ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై మంత్రి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీలో మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మెట్రో వాటర్ బోర్డు సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.