calender_icon.png 15 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెయింట్ పాల్స్‌లో ఘనంగా చిల్డ్రన్స్ డే

15-11-2025 12:49:26 AM

ముకరంపుర, నవంబరు 14 (విజయ క్రాంతి): సెయింట్ పాల్స్ హై స్కూల్లో శుక్రవారం చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా త్రీ టౌన్ సిఐ జాన్ రెడ్డి హాజరయ్యారు.

కార్యక్రమాన్ని స్కూల్ చైర్మన్ రాజ్కుమార్, ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని గారు ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, పాటలు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులుపాల్గొన్నారు.