22 July, 2026 | 3:08 AM

సివిల్ వివాదంలో నెక్కొండ ఎస్‌ఐ

22-07-2026 02:34 AM
  1. అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ
  2. సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ
  3. టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్న పలువురు  

వరంగల్, జులై 21 (విజయక్రాంతి): అవినీతి ఆరోపణలు, సివిల్ వివాదంలో తలదూర్చడం వంటి అంశాలపై వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్‌ఐ మహేందర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్వేత అతన్ని విధులనుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ రైతుకు సంబంధించిన వివాదంలో ఎస్‌ఐ జోక్యం చేసుకొని, ఏకపక్షంగా వ్యవహరించినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై విచారణ జరిపి ప్రాధమికంగా ఎస్త్స్ర జోక్యం చేసుకున్నట్లు నిర్ధారించారని సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పటికే గత పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హయాంంలో కూడా పలువురు పోలీసు అధికారులు సస్పెన్షన్ కు గురికాగా, తాజాగా కొత్త సీపీ శ్వేత కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ జరిపి ఎస్‌ఐ ని విధుల నుంచి తప్పించడంతో వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఎస్‌ఐని తప్పించిన వరంగల్ నగర పోలీసు కమిషనర్ శ్వేత చిత్రపటానికి కొందరు నెక్కొండ అంబేద్కర్ సెంటర్‌లో క్షీరాభిషేకం చేశారు. అలాగే టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.