ఎన్‌ఈపీ 2020ను రద్దు చేయాలి
ఎమ్మెల్సీ అలుగుబెట్లి నర్సిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఎన్‌ఈపీ 2020ను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా 5వ మహాసభలో ఆయన మాట్లాడారు. నూతన విద్యావిధా నం ద్వారా కనీస సదుపాయాలు లేని అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ నుంచి రెండవ తరగతి తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింద న్నారు.
దీంతో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నా రు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే చెల్లించాలన్నారు. కార్యక్రమం లో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లిక్కి బాల రాజు పాల్గొన్నారు. అంతకుముందు కొత్తగూడెం క్లబ్ నుంచి పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు పాల్గొన్నారు. సభకు సం ఘం జిల్లా అధ్యక్షుడు కిషోర్‌సింగ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యద ర్శి కృష్ణ, ఉపాధ్యక్షులు మురళీమోహన్, వరలక్ష్మి, ఎస్ వెంకటేశ్వర్లు, ఎం వెంక టేశ్వర్లు, పద్మారాణి, తావురియా పాల్గొన్నారు.






