ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన
ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని, ప్రజాస్వామ్యా నికి విరుద్ధంగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో సీతారాం ఏచూరి, బుద్దదేవ్ భట్టాచార్య ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ మహాసభలో తమ్మినేని ప్రసం గించారు.
శ్రీలంక తరహాలో మనదేశంలో నూ కమ్యూనిస్టుల పాలన తథ్యమనే విశ్వాసంతో ప్రజా సమస్యలపై పోరా టాలు నిర్వ హించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పదేళ్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలించారన్నారు. కమ్యూనిస్టులతోనే ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా లభిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలే దన్నారు. లగచర్లలో ఫార్మసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవడం కమ్యూనిస్టుల విజయంగా పేర్కొన్నారు.
ఈ సభలో పార్టీ నాయకులు నవీన్, జబ్జార్, తిరుపతిరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సాయిబాబు, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. మహాసభల ప్రారంభోత్సవానికి ముందు ఖమ్మంలో బండారు యాకయ్య, యర్రా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.






