12-11-2025 05:34:04 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో SGF U-19 బాలబాలికల ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరు ఆయిన డిఐఈ ఓ.బి రాందాస్, ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అండర్-19 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ బి బాబురావు మాట్లాడుతూ ఆటలు, చదువు పట్ల శ్రద్ధ చూపాలని విద్యార్థులకు సూచించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే విద్యార్థులు నెట్ బాల్ లో ప్రతిభ కనబరచాలన్నారు. ఉపాధ్యాయులు ఎం మల్లేష్, శ్రీ వర్ధన్ వివిధ కళాశాల నుండి వచ్చిన పిఈటి, పిడిలు తిరుపతి ఎన్ సుదీప్, మహేందర్, సాఫ్ట్ బేస్బాల్ సెక్రెటరీ గురువేందర్ నెట్ బాల్ కోచ్ కే. ప్రణీత్ విద్యార్థులను అభినందించారు. వివిధ కళాశాల నుంచి 60 మంది విద్యార్థి, విద్యార్థినిలు హాజరయ్యారు. దానిలో ప్రతిభగల విద్యార్థులను బాలురను 12 బాలికలను 12 రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థులు ఈనెల 15 నుంచి 17వ తేదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ లోని జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఉమ్మడి అదిలాబాద్ పాల్గొంటుందని ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.బాబురావు తెలిపారు.