7 March, 2026 | 4:35 PM

Breaking News

108 అంబులెన్స్ లో అర్ధరాత్రి ఆడపిల్ల జననం   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి   •   ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •  

అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు

07-03-2026 02:47 PM

హైదరాబాద్: మార్చి ప్రథమార్థంలోనే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు(Temperatures) 40 డిగ్రీలు దాటాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో శుక్రవారం అనేక జిల్లాల్లో 40°C, 41°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల సహా రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా తీవ్రమైన వేడి నమోదైంది. మార్చి 8-11 మధ్య వేడి నుండి కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మార్చి 12 నుండి మార్చి 15 వరకు ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మార్చి 16 తర్వాత వాతావరణ పరిస్థితులు మారవచ్చు, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.