వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఏ ఐసీసీ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శనివారం హైదరాబాద్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేం నరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కామారెడ్డి నుంచి తన అనుచరులతో వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సన్మానించారు.
రాజ్యసభ ఎన్నికలకు సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పార్టీ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పటిష్ట వంతానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించు కునేలా కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిండ్ల అంజయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్ లు జూలూరు సుధాకర్, సలీం జమీల్, చింతల రవీందర్ గౌడ్, తాటి ప్రసాద్, పంపరి శ్రీనివాస్, సాయిబాబా, రంగ రమేష్ గౌడ్, నర్సుల మహేష్, నవీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




