calender_icon.png 12 November, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను జయప్రదం చేయండి

12-11-2025 05:36:29 PM

ఐఎఫ్‌టీయూ పిలుపు..

​నూతనకల్ (విజయక్రాంతి): భారత విప్లవోద్యమ నేత చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ​సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ వర్ధంతి సభ జరగనుంది. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో వర్ధంతి సభ జయప్రదం పోస్టర్‌ను గంట నాగయ్య, ఇతర నేతలు ఆవిష్కరించారు.​ ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దింటి రంగారెడ్డి మాట్లాడుతూ... ​చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేశారని, ఆయన కృషి గొప్పదని కొనియాడారు. ​

ఈ వ్యవస్థ మార్పు కోసం ఆయన ప్రపంచంలోని వివిధ దేశాల పోరాట చరిత్రలను అధ్యయనం చేసి, మానవాళికి మార్గనిర్దేశం చేసే రచనలు చేశారని పేర్కొన్నారు.​ ఆయన ప్రతిఘటన పోరాట రూపశిల్పిగా, మార్క్సిస్టు-లెనినిస్టు సిద్ధాంతకర్తగా పేరు ప్రఖ్యాతులు పొందారని తెలిపారు.​ దేశంలోని ఎం.ఎల్. పార్టీలను ఐక్యం చేయడానికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని గుర్తుచేస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.​ ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, పీఓడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యురాలు పులుసు సుజాత, చిల్పకుంట్ల పార్టీ గ్రామ కార్యదర్శి దగ్గుల మల్లయ్య, గడ్డం శ్రీను, బోలగాని రమేష్, గంట కార్తీక్, పిడమర్తి అంజయ్య, చీమల సోమయ్య, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.