7 March, 2026 | 5:15 PM

మల్లన్నసాగర్ 3ఆర్ కాలువ పూర్తి చేయాలి

07-03-2026 02:11 PM

పుల్లూరు స్టేజి వద్ద రైతుల రాస్తారోకో

సిద్దిపేట రూరల్: సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ బండచెరువుపల్లి, పుల్లూరు గ్రామాల రైతులు(Farmer Protest) సిద్దిపేట–ముస్తాబాద్ రోడ్డుపై(Siddipet-Mustabad Road) ధర్నా చేపట్టారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు(Mallannasagar Project) భాగమైన 3ఆర్ కాలువ పనులను వెంటనే పూర్తి చేసి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గత సంవత్సరం మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) చొరవతో రూ.5 లక్షలు తన స్వంత డబ్బులు వెచ్చించి తాత్కాలికంగా కాలువ పనులు చేయించడంతో ఎండకాలంలో కూడా సాగునీరు అందిందని రైతులు తెలిపారు. అయితే ఈ సంవత్సరం కాలంగా ప్రభుత్వం కాలువ పనులు పూర్తిచేయకపోవడంతో  సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. కాలువ పనులు చేపడితే

ఇర్కోడు, చిన్నగుండవెల్లి, బండచెరువుపల్లి, పుల్లూరు, రమంచ, చంద్లాపూర్ వరకు సాగునీరు అందుతుంది. బండచెరువు, వెంకటయ్య చెరువు, పడమట చెరువు నింపుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువ పనులు పూర్తి చేయాలని కోరారు.