16 June, 2026 | 5:43 PM

కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి

16-06-2026 04:39 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొప్పుల వెంకట్ రెడ్డిని  మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలుపై ఇరువురు ఉన్నతాధికారులు ప్రాథమికంగా చర్చించుకున్నారు.

జిల్లాలోని రెవెన్యూ విభాగంలో సమర్థవంతమైన సేవలను అందించేందుకు, ప్రజల సమస్యల పరిష్కారానికి పారదర్శకమైన పాలనను అందించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి  రాకతో జిల్లా యంత్రాంగం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న ఈ ఇద్దరు అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.