16 June, 2026 | 5:47 PM

విద్యార్థులకు ఏఐపై ప్రత్యేక శిక్షణ

16-06-2026 04:42 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): ​నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'అన్న-అక్క మెంటర్‌షిప్' లో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఈనెల 18 19 తేదీల్లో ఈ శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మరియు పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో, విద్యార్థులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'అన్న-అక్క మెంటర్‌షిప్' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 5వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ లెర్నింగ్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ విద్యార్థులు సద్విని చూసుకోవాలని కోరారు. జేఎన్‌టీయూహెచ్ (JNTUH)లో ప్రత్యేక శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్ ద్వారా విద్యార్థులకు శిక్షణ అందించబడుతుంది.