16 June, 2026 | 5:43 PM

యూరియా బుకింగ్ యాప్ తో రైతులకు మేలు

16-06-2026 04:37 PM

హాజీపూర్,(విజయక్రాంతి): యూరియా బుకింగ్ యాప్ తో రైతులకు సమయం ఆదాతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) సురేఖ సూచించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేధికలో మంగళ వారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్  లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డైరెక్టర్ గోపిలతో రైతులు యూరియా వినియోగం గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులు పుస్కూరి శ్రీనివాస రావు, తిప్పని కుమార్ లు మాట్లాడుతూ... బుకింగ్ యాప్ ద్వారా రైతులు సులభంగా యూరియాను బుకింగ్ చేసుకోవడం జరుగుతుందనీ ఆనందం వ్యక్తం చేశారు. రైతుకు సమయం ఆదా అవుతుందని, క్యూ లైన్ లు లేకపోవడంతో రైతులు సులభంగా డీలర్ వద్ద వెళ్లి యూరియాను కొనుగోలు చేసుకుంటున్నారని తెలిపారు. యూరియా బుకింగ్ అవగాహన లేని రైతులకు మీసేవ కేంద్రం ద్వారా యూరియా బుకింగ్ అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా dao మాట్లాడుతూ రైతు ఉత్పత్తి దారుల సంఘం ద్వారా జాతీయ సహజ వ్యవసాయం చేసే 125 మంది రైతులతో కలసి సేంద్రీయ వ్యవసాయాన్నీ ప్రోత్సహిస్తున్నామన్నారు. జీలుగా, జనుము పచ్చిరొట్టతో యూరియా వినియోగాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల ADA మామిడి క్రిష్ణ, రైతు ఉత్పత్తి దారుల సంఘం డైరెక్టర్ పుస్కూరి శ్రీనివాస రావు, PACS CEO వినయ్, జాతీయ సహజ వ్యవసాయ రైతులు, మధు, కృషి, స్వప్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.