నూతన వస్త్ర అలంకరణ వేడుక.. పాల్గొన్న సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత వేణు
సత్తుపల్లి జూన్ 11 (విజయక్రాంతి): శీలం కుమార్ - రాజేశ్వరి దంపతుల కుమార్తెలు రమ్య, దీన కుమారి మరియు కుమారుడు సందీప్ ల నూతన వస్త్ర అలంకరణ వేడుక అత్యంత వేడుకగా, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత వేణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత వేణు నూతన వస్త్రధారణలో మెరిసిపోతున్న రమ్య దీన కుమారి మరియు సందీప్లను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకలో వైస్ చైర్ పర్సన్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు. అతిథుల రాకతో శీలం కుమార్ నివాసం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శీలం కుమార్ - రాజేశ్వరి దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






