calender_icon.png 12 December, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల మనోవికాస నూతన భవనం ప్రారంభం

12-12-2025 12:00:00 AM

హాజరైన నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక  ఖలీల్వాడి  లో డాక్టర్ విశాల్  పిల్లల మనోవికాస నూతన భవనన్నీ  ఏర్పాటు చేసినట్లు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. ఈ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమనకి హాజరైన  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య  నూతన భవనాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నేటి రోజులలో పిల్లలలో నేటి టెక్నాలజీ యుగంలో అనేక రకాలుగా  బుద్ధి మాంద్యం ,ఆలోచనా సరళి నడుచుకునే విధానంలో సమస్యలుఎదుర్కొంటున్నారని ఇటువంటి వారి కోరకై ప్రముఖ పట్టణాలలో ఏర్పాటు చేసేటువంటి ఈ మనోవికాస కేంద్రం ని నిజామాబాద్ లో డాక్టర్ విశాల్ ఆకుల ప్రారంభించడంఅభినందనీయమని  కొనియాడారు. 

అనంతరం సీ పి కి ఆస్పత్రి తరపున మెమెంటో శాలువాతో ఘనంగా సన్మానించారు తదాంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్. ఈ.  రవీంద్రారెడ్డి, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ వై శ్రీధర్ రాజు, డాక్టర్ వి జార్జి రెడ్డి, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రమేనేశ్వర్,డా. కప్పల రాజేష్ అడ్వకేట్ ఆర్ జగదీశ్వరరావు, ఎం సిద్దయ్య, డాక్టర్ కే రాజేష్, డాక్టర్ పి . బి. కృష్ణమూర్తి, డాక్టర్ కౌలయ్య తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, ఇతరాత్ర సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై డాక్టర్ విశాల్ ఆకుల కి అభినందనలు తెలపారు. కార్యక్రమంలో వారి సతీమణి డాక్టర్ నాగ పద్మ, వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.