12-12-2025 12:00:00 AM
ఆశీర్వాదం తీసుకున్న మండల మాజీ జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి
నాగిరెడ్డిపేట, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు హైమావతి తొమ్మిదోసారి కాశీవిశ్వనాథ్ స్వామివారిని దర్శించుకుని స్వగ్రామానికి ఆయురారోగ్యాలతో యోగక్షేమలతో చేరుకున్న సందర్భంగా జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హైమావతిని శాలువాతో సత్కరించి, సన్మానించారు. ఆమె ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... ఇలాగే ఆయురారోగ్యాలతో హేమవతి ఉండి మరెన్నోసార్లు కాశి విశ్వనాథుని దర్శించుకోవాలని కొనియాడారు. 90 ఏళ్ల వద్దురాలు హైమావతి కాశీ విశ్వనాథుని తొమ్మిది సార్లు దర్శించుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు.
కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండడం వల్లే ఆయురారోగ్యాలతో హైమావతి 9సార్లు దర్శించుకుందని మండల మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నరసింహరావు,టీచర్ మాధురి,గురుస్వామి శ్రీనివాస్, భూదేవి తదితరులు పాల్గొన్నారు.