28 April, 2026 | 3:41 AM

నూతన బస్ సర్వీసులకు శ్రీకారం

28-04-2026 02:05 AM

శంకర్ గౌడ్‌కు సంతాపం..

వేములవాడ, ఏప్రిల్ 27,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ నుంచి భద్రాచలం వరకు నూతన ఆర్టీసీ బస్ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల సమ్మె సమయంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్కు ఆయన సంతాపం తెలిపారు.వేములవాడ రాజన్న క్షేత్రం నుంచి కొత్త బస్ సర్వీసులు ప్రారంభం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

ఇప్పటికే శ్రీశైలం మార్గంలో సేవలు ప్రారంభించామని, త్వరలో బాసరకు కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కార్మికుల సమస్యలను వేగంగా పరిష్కరించిందని, ప్రజా ప్రభుత్వం కార్మికుల గౌరవాన్ని కాపాడిందన్నారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కార్మికుల పట్ల నిర్లక్ష్యం చూపించారని విమర్శించారు.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, మరిన్ని నిధుల కోసం త్వరలో సీఎంతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ సంస్థను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.