నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం
06-05-2026 02:34 AM
దేవరకొండ, మే 5: దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రామ్ దుర్గా రెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డివిజన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. మారుమూల ప్రాంతమైన దేవరకొండకు రావడం ఆనందదాయకమని, పేద వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, రెడ్డి కోటేశ్వరరావు, అంకం చంద్రమౌళి, లావుడి బాషా చౌహన్, పున్న వెంకటేష్, భీమవరం శివ గౌడ్, బొమ్మిడి వెంకటయ్య, పున్న బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.






