11 May, 2026 | 2:20 AM

భిక్కనూర్ ప్రెస్‌క్లబ్‌కు కొత్త కమిటీ..

11-05-2026 01:05 AM

అధ్యక్షుడిగా రవికుమార్ ఎన్నిక

భిక్కనూర్, మే 10 (విజయక్రాంతి): భిక్కనూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గౌరిశెట్టి రవికుమార్ (దిశ) ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా గజవాడ నాగరాజు (సాక్షి) బాధ్యతలు స్వీకరించారు.

ఉపాధ్యక్షులుగా నక్క మహేష్ (సూర్య), శ్యాంసుందర్ (నవ తెలంగాణ), కోశాధికారిగా దండు అనిల్ కుమార్ (ఆంధ్రజ్యోతి) ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా పరశురాం గౌడ్ (మన తెలంగాణ), శేఖర్ గౌడ్ (నమస్తే తెలంగాణ), సంతోష్ రెడ్డి (ఈనాడు) ఎంపికయ్యారు. ముఖ్య సలహాదారుడిగా జంగం బాలప్రకాశ్ (ఆంధ్రప్రభ) నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, కార్యదర్శి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. సమాజంలో నకిలీ విలేకరుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా బాధ్యతాయుతంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.