8 April, 2026 | 10:09 PM

పాస్టర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు

08-04-2026 08:16 PM

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అచ్చంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని ఎంబి షాలెం చర్చిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గం పాస్టర్ల సంఘం గౌరవ అధ్యక్షులు ఆశీర్వాదంను ఎన్నుకున్నారు.

అధ్యక్షులు  కే .అబ్రహం, ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జాన్ సొలోమోన్, ప్రధాన కార్యదర్శిగా షాలెం రాజు, సహాయ కార్యదర్శులు ఆర్ వెంకటయ్య, సంధ్యారాణిలను ఎన్నుకున్నారు. అలాగే ఆర్థిక కార్యదర్శిగా సుజ్ఞాని, ఆడిటర్సుగా క్రిస్టఫర్, షాలెం రాజులను నియమించారు.

కమిటీ సలహాదారులుగా ఏలియా, ఆనంద్, రాజు, శ్రీను, రామస్వామి, పరంజ్యోతి ,సత్యం, తిమోతి ,శామ్యూల్, ఎలియాజర్ లను నియమించారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా దినకర్, సురేష్  ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అచ్చంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మీసాల సుధాకర్,  సెక్రటరీ బొంత ప్రభాకర్, సుందర్ రాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఎం బి శాలెం చర్చ్ చైర్మన్ జేమ్స్, అబ్షాలోము, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.