8 April, 2026 | 10:08 PM

ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ ఎన్నిక

08-04-2026 08:18 PM

- అధ్యక్షుడిగా యాకూబ్ పాషా

– ప్రధాన కార్యదర్శిగా ఉప్పల్

కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీని స్థానిక కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రహనుమా-ఏ-దక్కన్ జాతీయ దినపత్రిక కొత్తగూడెం జిల్లా బ్యూరోగా పనిచేస్తున్న ఎండీ. యాకూబ్ పాషా, ఉపాధ్యక్షుడిగా రహనుమా-ఏ-దక్కన్ కొత్తగూడెం నియోజకవర్గ రిపోర్టర్ ఎండీ. జలీల్, ప్రధాన కార్యదర్శిగా మున్సిఫ్ ఉర్దూ చానల్ జిల్లా రిపోర్టర్ ఉప్పల్, సహాయ కార్యదర్శిగా మున్సిఫ్ పత్రిక రిపోర్టర్ ఎండీ రఫీ,కోశాధికారిగా మాజీద్ ఖురేషి, సభ్యులుగా ఎండీ అన్వర్,ఎంఏ నయీమ్‌లను ఎన్నుకున్నారు.

ఈ ఎన్నికలను ఖమ్మం నుండి వచ్చిన టీయూడబ్ల్యూజేయూ జిల్లా అధ్యక్షుడు షేక్ అహద్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ రెండు సంవత్సరాలపాటు పదవిలో కొనసాగనుంది.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు యాకూబ్ పాషా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.