06-12-2025 05:23:13 PM
హైకోర్టు జడ్జి లక్ష్మీనారాయణ అలిశెట్టి..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): కక్షిదారుల సౌలభ్యం కోసమే నూతన కోర్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందని హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నూతనంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జి లు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ జె, శ్రీనివాస్ రావు లు ప్రారంభించారు, అంతకు ముందు హైకోర్టు జడ్జిలకు రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ స్వాగతం పలికి పుష్పగిచం అందజేశారు.
ఈ సందర్భంగా పోలీసులు హైకోర్టు జడ్జిలకు గౌరవ వందనం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించినందు కు జూనియర్ సీనియర్ అడ్వకేట్స్ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గోదావరిఖని లేబర్ కోర్టు అడిషనల్ స్టేషన్స్ జడ్జి శ్రీనివాసరావు, పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత కుంచాల, సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ డి, గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
హై కోర్టు న్యాయవాదుల కు ఘనంగా సన్మానం..
సుల్తానాబాద్ లో శనివారం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించేందుకు వచ్చిన హైకోర్టు జడ్జిలు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ జె శ్రీనివాస్ రావులను సుల్తానాబాద్ పెద్దపల్లి అసోసియేషన్ అడ్వకేట్లు మెమొంటోళ్లు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.