calender_icon.png 4 July, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో దేవాదాయశాఖ నూతన కార్యక్రమం!

04-07-2025 12:00:00 AM

  1. పురాతన ఆలయాల రక్షణకు కమిటీ ఏర్పాటు
  2. ఎన్నారైలనూ భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు

హైదరాబాద్, జూలై ౩ (విజయక్రాంతి): రాష్ట్రంలోని పురాతన దేవాలయాల రక్షణ కోసం దేవాదాయ శాఖ వినూత్న కార్యక్ర మం చేపట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలోని పురాతన, చారిత్రిక ప్రాధాన్యత ఉండి వెలుగులోకి రాని అనేక ఆలయాలను రక్షించేందకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని కోసం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయన్నుట్టు తెలిసింది.

ఈ కమిటీలో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ విభాగాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారని సమాచారం. ఆలయ సమాచారం, నిర్వహణకు సంబంధించిన భూములు, ఇతరత్రా సమాచా రం కోసం రెవెన్యూ విభాగం, పట్టణా ల్లోని ఆలయాల కోసం మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల కోసం పంచాయతీరాజ్ విభాగాన్ని కమిటీలో భాగస్వామ్యం చేయనున్నారు.

ఇక ఆలయాల విశిష్టత, స్థల పురాణం, ఆలయాలకు సంబంధించిన చరి త్ర, శాసనాల వివరాలు, శిల్పకళా విశిష్టత, భవిష్యత్తు తరాలకు సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తోందని దేవాదాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలయాల నిర్వహణకు కావాల్సిన నిధులను సీఎస్‌ఆర్ ద్వారా సమకూర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీజీఎఫ్, ఎస్డీఎఫ్ నిధులను కూడా వినియోగించేందుకు చూస్తున్నట్టు సమాచారం.

వీటి తో పాటు ఆలయాల ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా ఎన్నారైలు ఉంటే వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. కమిటీ విధివిధానాలు ఖరా రు చేసేందుకు రెండు, మూడు నెలల్లో సీఎం తో దేవాదాయ శాక సమావేశం కానుంది. ఆ సమావేశం అనంతరం పురాతన ఆలయాలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు, కార్యాచరణ ఏమిటన్నది తెలిసే అవకాశం ఉంది.